వంగూరు, సెప్టెంబర్ 27 : మన హక్కులు, మన ప్రాంత సమస్యలు సాధించే వరకు పోరాటం సాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరు జలసాధన సమితి ఆధ్వర్యంలో డిండి ఎత్తిపోతలను ఎత్తేయాలని ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన పాదయాత్రను హరగోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరుకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను నిలిపివేయాలని రైతులు పెద్దఎత్తున కోరుతున్నారని చెప్పారు. జలసాధన సమితి చేపట్టిన పాదయాత్రకు ఎమ్మెల్సీ కోదండరాం, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరై మద్దతును ప్రకటించారు.