కేదార్నాథ్ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ్ జిల్లా కేదార్నాథ్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో దారి మధ్యలో 4 వేల మంది చిక్కుకుపోయారు. కొండపై నుంచి వరుసగా రాళ్లు, మట్టి పెళ్లలు పడుతుండటంతో రహదారిని క్లియర్ చేయడం కష్టతరంగా మారడంతో ఆదివారం యాత్రను నిలిపివేశారు.
ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలను కూడా ఆపేశారు. డెహ్రాడూన్, టెహ్రీ, హరిద్వార్, పౌరీ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.