కాఠ్మాండు: నేపాల్‌ను భారీ వర్షాలు మరోమారు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందారు.
బంగ్లంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఓ ఇల్లు శిథిలాల కింద కూరుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులు మృతి చెందారు. పాల్సా జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.