PAN-Aadhaar | మే 31 వరకూ ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు.. లేదంటే టీడీఎస్ డబుల్ డిడక్షన్.. సీబీడీటీ అలర్ట్
PAN-Aadhaar | వచ్చేనెలాఖరులోపు పాన్-ఆధార్ కార్డు అనుసంధానించని పన్ను చెల్లింపుదారుల నుంచి టీడీఎస్ డిడక్షన్ రెండింతలు అవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
PAN-Aadhaar | గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పటికే పలుసార్లు ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి ఆదాయం పన్ను విభాగం గడువులు విధించింది. తాజాగా, వచ్చే నెలాఖరులోగా ఆధార్-పాన్ కార్డు అనుసంధానమైతే టీడీఎస్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయం పన్ను విభాగం స్పష్టం చేసింది.
అయితే, ఆదాయం పన్ను విభాగం నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ ఆధార్‌తో పాన్ కార్డును అనుసంధానించక పోతే సాధారణంగా వర్తించే టీడీఎస్‌కు రెండింతలు ఎక్కువ డిడక్షన్ జరుగుతుందని ఈ నెల 24న జారీ చేసిన సర్క్యులర్‌లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ గా ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిపే లావాదేవీల సమయంలో టీడీఎస్ / టీసీఎస్ కలెక్షన్ ఎగవేతకు పాల్పడుతున్నారని నోటీసులు వస్తున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని వివరించింది.
2022 జూన్ 30 వరకు ఫ్రీగానే పాన్-ఆధార్ అనుసంధానం జరిగింది. 2022 జూలై ఒకటో తేదీ నుంచి 2023 జూన్ 30 వరకూ రూ.1000 ఆలస్య రుసుముతో ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి అనుమతించారు. తర్వాత అనుసంధానించని పాన్ కార్డులు ఇన్ ఆపరేటివ్‌గా మారాయి. ఇప్పుడు ఎవరైనా ఆధార్-పాన్ కార్డు అనుసంధానించుకోవాలంటే ముందు రూ.1000 ఫైన్ పే చేయాలి. అలా మనీ చెల్లించిన తర్వాత పాన్ కార్డ్ ఆపరేటివ్ లోకి రావడానికి 30 రోజులు పడుతుంది. ఆధార్-పాన్ కార్డు అనుసంధానించకుంటే ఐటీ రిఫండ్స్ ఉండవని, తర్వాత రీఫండ్ అయినా, ఆలస్యమైన సమయానికి వడ్డీ చెల్లించబోమని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. అయితే, 2024 మార్చి 31 వరకూ జరిగిన ఆర్థిక లావాదేవీలపై సాధారణ రేటు టీడీఎస్ లేదా టీసీఎస్ వసూలు చేస్తామని సీబీడీటీ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

