KKR vs PBKS : సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(30), సునీల్ నరైన్(37) ధనాధన్ ఆడుతున్నారు. పంజాబ్ బౌలర్లను చితక్కొడుతూ బౌండరీల మోత మోగిస్తున్నారు. వీరిద్దరి జోరుతో కోల్‌కతా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. దాంతో, 5 ఓవర్లకు కోల్‌కతా వికెట్ కోల్పోకుండా 70 రన్స్ కొట్టింది.
ఈడెన్ గార్డెన్ వేదికగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి సామ్ కరన్ బౌలింగ్ తీసుకున్నాడు. లివింగ్‌స్టోన్ స్థానంలో బెయిర్‌స్టో పంజాబ్ జట్టులోకి రాగా.. మిచెల్ స్టార్క్ చేతుల మీదుగా శ్రీలంక పేసర్ దుష్మంత చమీర డెబ్యూ క్యాప్ అదుకున్నాడు.