Rishabh Pant: టెస్టుల్లో విధ్వంసక ఆటకు కేరాఫ్ అయిన రిషభ్ పంత్ (Rishabh Pant) వన్డేల్లో చోటు కోల్పోయాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌కు దూరమైన అతడు తాజా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన కెరీర్, జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రభావం, అసూయ పుట్టించేలా సాగుతున్న విరాట్ కోహ్లీ కెరీర్, విదేశీ పర్యటనలో సవాళ్లు ఇలా చాలా అంశాలపై ఈ చిచ్చరపిడుగు సూటిగా బదులిచ్చాడు. అంతేకాదు వైట్‌బాల్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) తన వైట్ బాల్ కెరీర్‌ను ముగించాడని, నాలుగేళ్ల క్రితం కారు యాక్సిడెంట్ అనంతరం జీవితం పట్ల నా ఆలోచన మారిందని పేర్కొన్నాడు పంత్.
భారత వన్డే జట్టులో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ దేశవాళీ క్రికెట్లో రెస్టాఫ్ ఇండియా సారథిగా ఎంపికయ్యాడు. ధనాధన్ ఆటతో ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చేసే పంత్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. చార్లీ స్టెబ్బింగ్స్ పాడ్‌కాస్ట్‌లో పిచ్చాపాటిలో భాగంగా భారత వికెట్ కీపర్ పలు కీలక విషయాలు పంచుకున్నాడు. ఒకట్రెండ్ ఏళ్లలోనే విజయవంతం అవ్వాలనుకుంటున్నారా? లేదా వచ్చే 15-20 ఏళ్లు కెరీర్ నిర్మించుకోవాలని భావిస్తున్నారా అనే ప్రశ్నకు.. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నాడు పంత్. ధోనీ చెప్పినట్టుగా చిన్న చిన్న విజయాల కంటే నేను పెద్ద లక్ష్యాలపై దృష్టి సారిస్తాను అని అతడు బదులిచ్చాడు.
🚨 Rishabh Pant talking about on difficulty in overseas condition 🚨
“When you’re playing in local conditions, in domestic conditions, you’re so used to them because you have practiced there so many times. But when you go overseas, you would adjust different kind of condition,… pic.twitter.com/HMkMcFlc7y
— VIKAS (@Vikas662005) September 30, 2026
ప్రశ్న: టీ20 వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికైన సంజూ శాంసన్‌పై మీ అభిప్రాయం?
జవాబు: అతడి వల్లే నా వైట్‌బాల్ కెరీర్ దాదాపు ముగిసింది. అందుకు నేనూ కారణమే. శాంసన్ గొప్ప ప్రదర్శన చేశాడు. నేను సరిగ్గా ఆడలేదు. అందుకు బాధగా ఉంది. సంజూ భయంకరమైన ఆటగాడు. భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతడి పాత్రం మరువలేం. వరల్డ్‌కప్ అనంతరం నేను సంజూను అభినందించాను.
ప్రశ్న: వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కనుందుకు బాధగా ఉందా?
జవాబు: అవును.. చాలా బాధగా ఉంది. కానీ, ఓ అథ్లెట్‌కు కొన్ని సందర్భాల్లో ఇలాంటి తప్పవు. అయితే.. జట్టులో స్థానం పోయినప్పుడు.. కచ్చితంగా పునరాగమనానికి అవకాశం ఉంటుందని నమ్ముతా. ప్రతి క్రికెటర్ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం విరాట్ కోహ్లీ (Virat Kohli) అయితే తప్ప ఎల్లప్పుడూ కెరీర్ ఒకేలా సాగదు. భారత క్రికెట్లో విరాట్ కెరీర్ గొప్పగా నడుస్తోంది.
🚨 Rishabh Pant on being dropped from the ODI squad :
Rishabh 🗣️: “Obviously, you feel bad, but as an athlete, you have to understand that whenever there’s a setback, there’s always a comeback.”
[Via : Business Of Sport] pic.twitter.com/xv7FXJ2ZVq
— ONE7 (@17pixles) September 29, 2026
ప్రశ్న: స్వదేశంలో కంటే విదేశాల్లోనే బ్యాటింగ్ సవాళ్లు ఎదురువుతాయి. ఎందుకు?
జవాబు: స్థానికంగా ఆడేటప్పుడు మనకు ఇక్కడి పరిస్థితులు తెలుసు. అక్కడ ఎక్కువ సమయం సాధన చేస్తాం కాబట్టి పిచ్ ఎలా ఉంటుంది? ఎలా ఆడాలి? అనేది ఆలోచించాల్సిన పనిలేదు. కానీ, విదేశాల్లో అలా కాదు. అక్కడ మనకు అసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. పిచ్, బౌలర్లు.. వాతావరణం అన్నీ మనకు సవాల్ విసురుతాయి.
ప్రశ్న: కారు యాక్సిడెంట్ తర్వాత మీలో వచ్చిన మార్పు?
జవాబు : నాలుగేళ్ల క్రితం కారు యాక్సిడెంట్‌తో జీవితం పట్ల నా ఆలోచన మారింది. అప్పటివరకు క్రికెట్‌పై, నచ్చినట్టు బతకడంపై మాత్రమే దృష్టి సారించేవాడిని. కానీ, ఆ యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎంత ముఖ్యమో, రెప్పపాటులోనే పరిస్థితులు ఎలా మారుతాయో అప్పుడే అర్ధమైంది. ప్రస్తుతం నేను మానసికంగా ద్రుఢంగా ఉన్నా. గతం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నేను పుట్టిన ఉత్తరాఖండ్‌లో చాలా చేయాలనుంది. అక్కడ నా ఫౌండేషన్ ద్వారా అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను కొనసాగించాలని ఉంది అని వెల్లడించాడీ డాషింగ్ బ్యాటర్.
🔴MS DHONI’S ADVICE THAT STUCK WITH ME 🤯
– Rishabh Pant revealed that MS Dhoni once asked him:
🎙️: “Do you want success for one or two years, or do you want to build a career for 15–20 years? It’s up to you.”
Pant says those words stuck with him, and since then, he has always… pic.twitter.com/AudsOP3j16
— Sam (@cricsam02) September 29, 2026
ప్రశ్న: ఫేవరెట్ బ్యాటింగ్ భాగస్వామి
జవాబు: టీ20ల్లో – రోహిత్ శర్మ
టెస్టుల్లో – రవీంద్ర జడేజా
ప్రశ్న: బెస్ట్ కవర్ డ్రైవ్
జవాబు: విరాట్ కోహ్లీ
ప్రశ్న: నీ బ్యాటింగ్ స్టయిల్లో చేర్చుకోవాలనుకున్న షాట్
జవాబు: ఎంఎస్ ధోనీ ట్రేడ్‌మార్క్ అయిన హెలిక్యాప్టర్ షాట్
ప్రశ్న: ఫేవరెట్ ఐపీఎల్ జట్టు?
జవాబు: ఢిల్లీ క్యాపిటల్స్
ప్రశ్న: నువ్వు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్
జవాబు: టెస్టుల్లో హేజిల్‌వుడ్
మొత్తంగా మిచెల్ స్టార్క్