ఎన్నికల ప్రచారం కాదిదీ.. హామీలు గుప్పించే సభాస్థలి
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు ఎలాంటి వరాలు ప్రకటించరాదు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీ ఎన్నికల జన జాతర విజయభేరి సభకు హాజరై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు.
- నారాయణఖేడ్‌లో లైబ్రరీ కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తా
- మహిళా ఐటీఐ కళాశాల ఏర్పాటు బాధ్యత నాదే..
- 2వేల ఎకరాల భూసేకరణ చేయండి.. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తా…
- ఎన్నికల కోడ్ తర్వాత చేస్తానని హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు ఎలాంటి వరాలు ప్రకటించరాదు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీ ఎన్నికల జన జాతర విజయభేరి సభకు హాజరై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జన జాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి హామీలు గుప్పించారు. ఇంటర్మీడియట్లో మొదటి, రెండో సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని, వారికోసం మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ, పీజీ కళాశాల, ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రాంతీయ పారిశ్రామికరణ కేంద్రం ఏర్పాటు, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పెద్దశంకరంపేటలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిండుసభలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. నారాయణఖేడ్‌కు 24/7 లైబ్రరీకి ఎస్డీఎఫ్ కింద రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహిళా ఐటీఐ మంజూరు చేస్తున్నానని, నారాయణఖేడ్‌లో 2వేల ఎకరాలు భూసేకరణ చేసి 30 రోజుల్లో అప్పగిస్తే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తద్వారా యువతకు, మహిళలకు ఉపాధి దొరుకుతుందని, ఇవన్నీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

