Flipkart | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ తన యూజర్ల కోసం మరోమారు బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ప్రకటించింది. వచ్చేనెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లియెన్సెస్ పై డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ యూజర్లకు ఒక రోజు ముందే.. మే రెండో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిస్కౌంట్లు లభిస్తాయి.
ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఐదుశాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ సాయంతో రూ.లక్స వరకూ కొనుగోలు చేయొచ్చు. దీనిపై నో-కాస్ట్ ఆఫర్ కూడా ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ మీద కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆఫర్లు ఇచ్చే కంపెనీల ఉత్పత్తుల వివరాలను బయట పెట్టలేదు.