Nagaland: నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి 19 మంది మృతి.. ముఠా గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు
Nagaland: నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు సిట్ ఏర్పాటు చేశారు.
కోహిమా: నాగాలాండ్(Nagaland)లో కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 19కి చేరింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల నుంచి రెండు జిల్లాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉన్నది. మోకాక్చుంగ్లో 8 మంది, టున్సాంగ్లో 11 మంది మృతిచెందారు. కల్తీ మద్యం ముఠాను పట్టుకునేందుకు నాగా పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం ఎక్కడ నుంచి సరఫరా అవుతుందో తేల్చేందుకు ఆ సిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
అదనపు ఎస్పీ ఐ బుంగ్లాండ్ చాంగ్ , సీనియర్ ఎస్పీ వెసుప్రా కీజో నేతృత్వంలో పనిచేయనున్నది. అనుమానిత లిక్కర్ శ్యాంపిళ్లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం గౌహతికి పంపించారు. ఈ కేసులో కొన్ని ఆధారాలు దొరికాయని, కానీ ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరగడంతో.. పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. కల్తీ మద్యంతో లింకున్న సుమారు 19 మందిని అరెస్టు చేశారు. మూడు వేల బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశారు. వాస్తవానికి నాగాలాండ్‌లో 1990 నుంచి మద్య నిషేధం అమలులో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

