తిరుమల : భక్తువత్సల గోవిందా.. భాగవత ప్రియ గోవిందా అంటూ భక్తుల నినాదాలతో తిరుమల ( Tirumala ) గిరులు మారుమ్రోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 66,014 మంది భక్తులు దర్శించుకోగా 31,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 4.23 లక్షల లడ్డూలను విక్రయించగా 2.25 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు తెలిపారు.