Srikanth Odela | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే తుఫాన్ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ (Worldwide Gross) రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన రెండో సినిమా కావడం, దానికి తోడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు తోడవడంతో థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తోంది. నాని మాస్ పెర్ఫార్మెన్స్కు థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. వారం రోజులు ముగిసేసరికే ఈ సినిమా మరిన్ని భారీ మైలురాళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
#TheParadise collects 114 CRORES+ GROSS WORLDWIDE in 2 days
Natural Star @NameisNani in an @odela_srikanth cinema
An @anirudhofficial musical pic.twitter.com/lH96x8ib0s— Vamsi Kaka (@vamsikaka) September 26, 2026