T-Hub | సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏరోస్పేస్ రంగంలో ఎంతో అనుభవమున్న కొలిన్స్ ఏరోస్పేస్ కంపెనీతో జత కట్టింది. టీహబ్ వేదికగా ఇప్పటికే స్కైరూట్ స్పేస్, ధ్రువ ఏరోస్పేస్ వంటి స్టార్టప్ కంపెనీలు ఎంతో విజయవంతంగా ఆ రంగంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
ఏరోస్పేస్ రంగంలో మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఔత్సాహికుల స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం టీహబ్‌లో వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డైనమిక్ ట్రావెల్ టైమ్, డిజిటల్ ప్రొడక్ట్ పాస్‌పోర్టు, రియల్ టైమ్ వెదర్ డేటా ప్యూజన్, మెటా సర్పేస్ డిస్ప్లే వంటి అంశాల్లో ఆవిష్కరణలు చేసే వారికి ప్రోత్సాహం అందించనున్నారు. ఔత్సాహికులు లింకు (https://bit.ly/49KhwiB)లో సంప్రదించాలని, మే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.