Kavya Maran | హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్
Kavya Maran | ఐపీఎల్-17 సీజన్లో (IPL 2024) వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆటగాళ్ల పేవల ప్రదర్శనతో స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) తీవ్ర నిరాశకు గురయ్యారు.
Kavya Maran | ఐపీఎల్-17 సీజన్లో (IPL 2024) వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఝలక్ ఇచ్చింది. సొంతగడ్డ ఉప్పల్‌లో హైదరాబాద్‌ను 35 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారీ ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రీజులోకి వచ్చినోళ్లు వచ్చినట్టే వెనుదిరిగారు.
ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వికెట్లు తీస్తున్నప్పుడు కావ్య మారన్ పలు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించారు. నిరాశ, అసహనం, బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. కావ్య మారన్ రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే ఉప్పల్ స్టేడియంలో గత నెల చివర్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల స్కోర్ చేశారు. అయితే స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షించిన ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran).. రన్ ఫీస్ట్‌ను ఫుల్ ఎంజాయ్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు కొడుతుంటే.. కావ్య మారన్ స్టాండ్స్‌లో గంతులేస్తూ ఆ మజాను ఫీలైంది. తనకు నచ్చిన స్టయిల్లో స్టెప్పులేస్తూ.. స్టాండ్స్‌లో గెంతేసింది. ఆ దృశ్యాలు అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఆర్సీబీ వరుసగా ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆ జట్టు ఉప్పల్‌లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా చెలరేగింది. ఐపీఎల్లో 250వ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ.. ఈ సీజన్లో తమ అత్యధిక పరుగుల (263) రికార్డును మూడుసార్లు చెరిపేసిన ఎస్ఆర్హెచ్ను వారి సొంత ఇలాఖా ఉప్పల్‌లో ఓడించి బదులు తీర్చుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ (43 బంతుల్లో 51, 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్దే ఆగిపోయింది.
Kavya Maran tonight. pic.twitter.com/peqL0ZN95b
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024
#RCB Rocked 😎
Kavya Maran Shocked 😮💨
Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024
Kavya Maran 😭😭😭 pic.twitter.com/5JfJAm2IeI
— Yashvi (@BreatheKohli) April 25, 2024
Kavya Maran’s reactions today.#KavyaMaran#RCBvsSRH #SRHvRCB pic.twitter.com/QxjplbpEBR
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) April 25, 2024
Also Read..
Sudha Murty | ఓటేయండి.. మీ నాయకుడిని ఎన్నుకోండి.. ఓటర్లకు సుధామూర్తి పిలుపు
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలు.. విద్యార్థుల అరెస్ట్‌తో అట్టుడుకుతున్న యూఎస్ వర్సిటీలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

