US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలు.. విద్యార్థుల అరెస్ట్‌తో అట్టుడుకుతున్న యూఎస్ వర్సిటీలు
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు (US Universities) అట్టుడుకుతున్నాయి.
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు (US Universities) అట్టుడుకుతున్నాయి. గాజా పోరులో ( Gaza Protests) ఇజ్రాయెల్‌కు మద్దతుగా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు (pro-Palestinian protests). దీంతో సామూహిక అరెస్టులు, తరగతుల బహిష్కరణ (shut down classes)తో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి.
గత వారం రోజుల్లో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల నుంచి సుమారు 550 మంది విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 60 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి.
గురువారం జార్జియాలోని అట్లాంటాలో గల ఎమోరీ విశ్వవిద్యాలయంలో 20 మంది కమ్యూనిటీ సభ్యులతో సహా 28 మందిని అరెస్ట్ చేశారు. ఇండియానా వర్సిటీలో కనీసం 33 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కొందరు నిరసన కారులు సిబ్బందిపై బాటిళ్లు విసరడం వంటి చర్యలకు దిగడంతో వారిని అదుపు చేసేందుకు అధికారులు పెప్పర్ బాల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది.
ఇక ఇండియానా వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. టెంట్లు వేయొద్దని ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ విద్యార్థులు పట్టించుకోలేదని, దాంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
Also Read..
Samantha | అవార్డ్స్ ఫంక్షన్ కోసం పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

