Samantha | పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించుకున్న సమంత.. ఎందుకంటే..?
Samantha | స్టార్ నటి సమంత (Samantha) చేసిన ఓ పనికి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన పెళ్లినాటి గౌనును (wedding gown) రీమోడలింగ్ చేయించి ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది.
Samantha | స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీల్లో టాప్‌లో ఉంటుందీ చెన్నై సుందరి. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సామ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. కాగా, గత కొన్ని రోజులగా మయోసైటిస్ కారణంగా సామ్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం తరచూ అభిమానులతో టచ్‌లోనే ఉంటూ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పనికి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన పెళ్లినాటి గౌనును (wedding gown) రీమోడలింగ్ చేయించి ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది. ప్రస్తుతం సామ్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.
సమంత 2017లో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడిపోయారు. ఇక అప్పుడు వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. క్రైస్తవ పద్ధతిలో జరిగిన వివాహానికి ప్రత్యేకంగా వైట్ గౌన్‌ను సామ్ డిజైన్ చేయించుకుంది. ఆ గౌనును ఇప్పుడు బ్లాక్ కాక్టైల్ స్ట్రాప్‌లెస్ గౌను (black cocktail gown)గా మార్చేసింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమంలో ఆ బ్లాక్ గౌనును ధరించి స్టేజ్‌పై మెరిసింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. తనకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించినట్లు తెలిపింది. తన అలవాట్లను మార్చుకోవడం, జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?
Mrunal Thakur | నటిగా నేను బాగా ఇబ్బందిపడ్డ సీన్ అదే: మృణాళ్ఠాకూర్
Gun Park | అమరవీరుల స్తూపం వద్ద పోలీసుల ఓవరాక్షన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

