English Gnani App | ఆంగ్ల భాషలో సమర్థవంతమైన విద్యాబోధనకు.. తరగతి గదుల్లో ఏఐ
కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞాన్ని అన్ని రంగాల్లో విసృత్తంగా వినియోగిస్తున్నారు. సరికొత్త అప్లికేషన్లు రూపొందిస్తూ అన్ని రకాల కార్యకలాపాలకు ఏఐ తప్పనిసరి అన్నట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ కేంద్ర బిందువుగా మారింది.
English Gnani App | సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞాన్ని అన్ని రంగాల్లో విసృత్తంగా వినియోగిస్తున్నారు. సరికొత్త అప్లికేషన్లు రూపొందిస్తూ అన్ని రకాల కార్యకలాపాలకు ఏఐ తప్పనిసరి అన్నట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ కేంద్ర బిందువుగా మారింది. దాన్ని కేంద్రంగా చేసుకునే రకరకాల అప్లికేషన్లు, టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలోని పరిశోధక బృందం కొత్తగా తరగతి గదుల్లో ఆంగ్ల భాషలో సమర్థవంతమైన విద్యాబోధనకు అవసరమైన యాప్‌ను రూపొందించింది. ‘ఇంగ్లిష్ జ్ఞానీ ’ పేరుతో రూపొందించిన ఈ వెబ్ అప్లికేషన్‌ను ప్రాథమికంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగత్మాకంగా పరిశీలించామని అప్లికేషన్ రూపకర్తలో ఒకరైన ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ సీనియర్ రీసెర్చ్ సైంటిస్టు అర్జున్ రాజశేఖర్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఆంగ్లంలో నేర్చుకునే వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు రాజ్ రెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ (ఆర్సీటీఎస్)లోని పరిశోధకులు ఇంగ్లిష్ మాట్లడం, చదివేందుకు సమర్థవంతంగా ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ‘ఇంగ్లిష్ జ్ఞానీ ’ పేరుతో ఒక టూల్‌ను రూపొందించామన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ వెబ్ అప్లికేషన్‌ను మరోసారి ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఉపాధ్యాయులతో ఉపయోగించి, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని తుది అప్లికేషన్‌ను దేశ వ్యాప్తంగా ఇంగ్లిష్ భాషా బోధనలో వినియోగించేలా ఈ పరిశోధన కొనసాగుతుందని అర్జున్ రాజశేఖర్ వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

