Raymond – Nawaz Modi Singhania | రేమండ్స్ డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు.. కారణమిదేనా..?!
Raymond - Nawaz Modi Singhania | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ కంపెనీలు జేకే ఇన్వెస్టర్స్, రేమండ్ కన్జూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ అండ్ ఫిన్ సర్వ్ నుంచి నవాజ్ మోదీ సింఘానియాను డైరెక్టర్‌గా తొలగిస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
Raymond – Nawaz Modi Singhania | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ కంపెనీలు జేకే ఇన్వెస్టర్స్, రేమండ్ కన్జూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ అండ్ ఫిన్ సర్వ్ నుంచి నవాజ్ మోదీ సింఘానియాను డైరెక్టర్‌గా తొలగిస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. గత నెల 31న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతం సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ సింఘానియా మధ్య కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న నేపథ్యంలో గ్రూపు సంస్థల డైరెక్టర్‌గా ఆమె తొలగింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. నవాజ్ మోదీ పై తాము విశ్వాసం కోల్పోయామని, వెంటనే బోర్డు సమావేశం నిర్వహించాలని కోరామని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. వారి కోరిక మేరకు గత నెల 31న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్‌గా నవాజ్ మోదీ సింఘానియాను తొలగించినట్లు చెప్పారు.
రేమండ్ గ్రూపు కంపెనీల్లో డైరెక్టర్‌గా తనను తొలగించడాన్ని నవాజ్ మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. గౌతం సింఘానియా దుశ్చర్యలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధిస్తున్నారని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కొంత కాలంగా గౌతం సింఘానియా, నవాజ్ మోదీ మధ్య వివాదం నెలకొన్నది. తనను గౌతం తీవ్రంగా వేధిస్తున్నారంటూ గతేడాది నవాజ్ మోదీ ఆరోపించారు. భౌతికంగానూ తనను హింసించారన్నారు. ప్రస్తుతం వీరిద్దరు విడాకుల కోసం పెట్టుకున్న దరఖాస్తు న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆస్తుల్లో వాటాల విషయమై వివాదం కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే, కోడలు నవాజ్ మోదీ సింఘానియాకే ఆమె మామ-విజయ్ పత్ సింఘానియా మద్దతు పలికారు. తండ్రీ కొడుకులు విజయ్ పత్ సింఘానియా, గౌతం సింఘానియా మధ్య కూడా వివాదాలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

