KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా.. గులాబీ అధినేతకు దారిపొడవునా కార్యకర్తల సంఘీభావం
KCR | దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన స్వగ్రామం నల్లబెల్లికి వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దారిపొడవునా సంఘీభావం తెలిపారు
KCR | దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన స్వగ్రామం నల్లబెల్లికి వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దారిపొడవునా సంఘీభావం తెలిపారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న మార్గంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఆయనకు అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు నర్సంపేట వైపు తరలుతున్నారు. తమ కుటుంబానికి కష్టమొస్తే నేనున్నానని అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు కార్యకర్తలు భరోసాగా నిలిచారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభివాదం.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రోడ్డు మార్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు,… pic.twitter.com/dkl9jytHy1
— BRS Party (@BRSparty) August 9, 2026
ఈ సందర్భంగా కేసీఆర్ సైతం తన కాన్వాయ్‌ను పలుచోట్ల ఆపి కార్యకర్తలను పలకరించారు. అధైర్యపడొద్దు.. మీకు నేనున్నానంటూ.. భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పారు. కార్యకర్తలను అనునయిస్తూ, వారిలో గుండె ధైర్యం నింపుతూ నల్లబెల్లి వైపు కదిలారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
మార్గమధ్యంలో భువనగిరి, ఆలేరు, బహుపేట వద్ద కేసీఆర్ గారికి స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. దారి పొడవునా నిలబడి కేసీఆర్ గారికి అభివాదం చేస్తూ… pic.twitter.com/GLGs1VX6K7
— BRS Party (@BRSparty) August 9, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- Nallabelli
- Narsampet
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

