KKR vs PBKS : ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్లు ఎట్టకేలకు తొలి వికెట్ తీశారు. బౌండరీలతో చెలేగుతున్న ఓపెనర్ సునీల్ నరైన్(71)ను స్పిన్నర్ రాహుల్ చాహర్ వెనక్కి పంపాడు. నరైన్ కొట్టిన బంతిని బెయిర్‌స్టో పట్టడంతో 138 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. దాంతో, పంజాబ్ జట్టు కాసింత ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఫిలిప్ సాల్ట్(63), వెంకటేశ్ అయ్యర్(9)లు ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 151/1.
పదిహేడో సీజన్లో ఉతికేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు మరోసారి అర్ధ శతకాలతో చెలరేగారు. ఫిలిప్ సాల్ట్(63), సునీల్ నరైన్(71)లు పంజాబ్ బౌలర్లకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా బౌండరీలు బాదారు. దాంతో, స్కోర్ 8 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న నరైన్‌ను.. రాహుల్ చాహర్ వెనక్కి పంపాడు. దాంతో 138 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.