Tanzania Floods | తూర్పు ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న భారీ వర్షాలు.. టాంజానియాలో 155 మంది మృతి
Tanzania Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయారు.
Tanzania Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు టాంజానియా (Tanzania), కెన్యా, బురుండీల్లో వరదలు సంభవించాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రధాని కాసిమ్ మజాలివా (Prime Minister Kassim Majaliwa) తాజాగా వెల్లడించారు. బలమైన గాలులు, వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంట నష్టంతోపాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పలు చోట్ల కొండచరియలు కూడా విరిగిపడినట్లు చెప్పారు. ఈ వర్షాల కారణంగా సుమారు 236 మంది గాయాలపాలైనట్లు తెలిపారు.
51 వేలకు పైగా ఇల్లు ధ్వంసమయ్యాయని, సుమారు రెండు లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారని ప్రధాని కాసిమ్ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మే నెలలో కూడా వర్షాలు కొనసాగుతాయని కాసిమ్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇక టాంజానియా పొరుగు దేశాలైన కెన్యా, బురుండీలలో కూడా భారీ వర్షాల కారణంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కెన్యాలో వర్షాల కారణంగా 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఆఫ్రికా ప్రాంతం ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Also Read..
Lok Sabha Pols | ఆసుపత్రి నుంచి వచ్చి ఓటేసిన నారాయణమూర్తి
Kavya Maran | హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్
Samantha | పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించుకున్న సమంత.. ఎందుకంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

