KKR vs PBKS | నరైన్, సాల్ట్ విధ్వంసం.. కొండంత స్కోర్ కొట్టిన కోల్‌కతా
KKR vs PBKS : పదిహేడో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బ్యాటర్లు మరోసారి తమ బ్యాట్లకు పని చెప్పారు. సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికేస్తూ మరోసారి జట్టుకు కొడంత స్కోర్ అందించారు. దాంతో, కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 261 రన్స్ కొట్టింది.
KKR vs PBKS : పదిహేడో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బ్యాటర్లు మరోసారి తమ బ్యాట్లకు పని చెప్పారు. సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికేస్తూ మరోసారి జట్టుకు కొడంత స్కోర్ అందించారు. దాంతో, కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 261 రన్స్ కొట్టింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) అర్ధ శతకాలతో చెలరేగి గట్టి పునాది వేయగా.. చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్(39 నాటౌట్)తో కలిసి ఈడెన్స్‌లో బౌండరీల మోత మోగించాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. దాంతో, పంజాబ్‌కు కోల్‌కతా దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Sunil Narine was at his absolute best again 💪
Watch his electrifying innings 🔽
Follow the Match ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS
— IndianPremierLeague (@IPL) April 26, 2024
8 ఓవర్లకే 100
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ నరైన్(71)లు అదిరే అరంభమిచ్చారు. ఈ ఇద్దరూ తమ విశ్వరూపం చూపిస్తూ.. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సాల్ట్, నరైన్‌లు ఎడాపెడా బౌండరీలు బాదడంతో 8 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న నరైన్‌ను.. రాహుల్ చాహర్ వెనక్కి పంపడంతో 138 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఆ క్షణం పంజాబ్ జట్టు కాసింత ఊపిరి పీల్చుకుంది.
Quick fire maximums ft. Shreyas Iyer#KKR nearing the 2️⃣5️⃣0️⃣-run mark!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvPBKS | @KKRiders pic.twitter.com/Cdj9sG1SES
— IndianPremierLeague (@IPL) April 26, 2024
అకాసేపటికే సాల్ట్ వెనుదిరిగినా.. వెంకటేశ్ అయ్యర్(39 నాటౌట్), ఆండ్రూ రస్సెల్(24) మెరుపులతో 16 ఓవర్లకే స్కోర్ 200 మార్క్ దాటింది. అప్పటికే అదిరిపోయిన పంజాబ్ బౌలర్లపై శ్రేయస్ అయ్యర్(28) సునామీలా విరుచుకుపడ్డాడు. సామ్ కరన్ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 బాది కోల్‌కతాకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత రింకూ సింగ్(5), రమన్‌దీప్ సింగ్()లు ధనాధన్ ఆడడంతో కేకేఆర్ రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

