KKR vs PBKS : పదిహేడో సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మరో పోరుకు సిద్దమైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా శుక్రవారం పంజాబ్ కింగ్స్(Pungab Kings)తో తలపడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి సామ్ కరన్(Sam Curran) బౌలింగ్ తీసుకున్నాడు. ఇరుజట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లివింగ్‌స్టోన్ స్థానంలోబ బెయిర్‌స్టో జట్టులోకి రాగా.. మిచెల్ స్టార్క్ బదులు దుష్మంత చమీర డెబ్యూ క్యాప్ అదుకున్నాడు.
కోల్‌కతా తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్(కెప్టెన్), రీలే రస్సో, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ఈ సీజన్‌కు ముందు మెంటార్‌గా గౌతం గంభీర్ రాకతో కోల్‌కతా జోరందుకుంది. ఈ ఎడిషన్‌లో ఐదు విజయాలతో టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ వస్తోంది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్ 9వ స్థానంలో నిలిచింది.