Satya Movie | తమిళ నటులు అమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగోలి’. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో కె బాబు రెడ్డి, జి సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో ‘సత్య’ అనే పేరుతో సీనియర్ ఫొటో జర్నలిస్ట్ శివ మల్లాల శివమ్ మీడియా పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ప్రతి తండ్రి తన కొడుకుకు ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది. అలాంటి సొసైటిలో నా వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది.