లక్నో: అర్ధరాత్రి వేళ కారులో ప్రయాణించిన కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. వారి కారు మిర్రర్‌ను ఢీకొట్టిన మరో కారులోని వ్యక్తులు అనంతరం వెంబడించారు. కారును క్రాస్ చేసిన తర్వాత అందులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. కారులో ఉన్న కుటుంబంపైకి రాళ్లు, బాటిల్స్ విసిరారు. దీంతో ఆ కారులో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. (Family in car chased) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 2న అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ఒక కుటుంబం కారులో ఆసుపత్రికి వెళ్తున్నది. టూ వే రోడ్డులో ఎదురుగా వచ్చిన మరో కారు వారి కారు సైడ్ వ్యూ మిర్రర్‌ను తాకింది.
కాగా, కుటుంబం ప్రయాణించిన కారును అనంతరం బీఎండబ్ల్యూ కారులోని వ్యక్తులు రెండు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఒక చోట వారి కారును ఓవర్టేక్ చేశారు. ఆ కారు నుంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. కుటుంబం ఉన్న కారు వైపు పరుగు తీయడంతోపాటు రాళ్లు, బాటిల్స్‌ను విసిరారు. అయితే అర్ధరాత్రి వేళ ఘర్షణను నివారించేందుకు ఆ కుటుంబం తమ కారును వేగంగా రివర్స్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం పోలీసుల సహాయం కోసం ప్రయత్నించింది.
మరోవైపు కారులోని డాష్ క్యామ్‌లో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ సంఘటన గురించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియో క్లిప్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.
महिला सुरक्षा की हक़ीक़त इस वीडियो में देखिए… 2 किमी तक पीछा करने के बाद लड़कों ने महिला की कार पर पत्थरबाज़ी की। महिला के कार के कैमरे में क़ैद हुई हरकत..
जगह नोएडा…थाना वही #नोएडा का कुख्यात बीटा 2 जहां कल ही एक मासूम कुणाल की जान पुलिसिया लापरवाही से गई है…@Uppolice pic.twitter.com/oXaucneLpX
— Mamta Tripathi (@MamtaTripathi80) May 6, 2024