Special Trains | వేసవి దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
Special Trains | వేసవి సెలవుల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వారాంతపు (Special Trains) రైళ్లను నడపనుంది.
అమరావతి : వేసవి సెలవుల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వారాంతపు (Special Trains) రైళ్లను నడపనుంది. 07234 నంబర్ గల రైలు ఈనెల 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి (Santragachi) వరకు నడుస్తుందని విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూకర్ తెలిపారు.
ఈ రైలు రాత్రి 11.40 గంటలకు బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు , విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అనకాపల్లి (Anakapalli) , విజయనగరం , శ్రీకాకుళం, బరంపూర్, భువనేశ్వర్, కటక్ , ఖరగ్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచికి చేరుకుంటుందని వివరించారు.
ఇదే రైలు 07235 నంబర్తో ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుందన్నారు. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్(Reservation) సౌకర్యం ఉండదని ఆయన వెల్లడించారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

