కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శ్రేణులు సైనికుల్లా పని చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి, మల్కారం, నానాజీపూర్ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే తన నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 26 : చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శ్రేణులు సైనికుల్లా పని చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి, మల్కారం, నానాజీపూర్ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే తన నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా జ్ఞానేశ్వర్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలన్నారు.
పదేండ్లలో సీఎంగా కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు దాటినా.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా.. సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నట్లు చెప్పారు. చేవెళ్ల ఎంపీగా కాసానిని గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నీరటి రాజుముదిరాజ్, మాజీ సర్పంచ్‌లు దండు ఇస్తారి, కల్పనాసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

