KCR | తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని బీజేపీకి ఓటెయ్యాలె..? : కేసీఆర్
KCR | కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు రోడ్ షో నిర్వహించిన కేసీఆర్.. అక్కడ క్లాక్‌టవర్ దగ్గర ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తూలనాడారు.
KCR : కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు రోడ్ షో నిర్వహించిన కేసీఆర్.. అక్కడ క్లాక్‌టవర్ దగ్గర ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తూలనాడారు.
‘పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకోని జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాసినం. బతిమాలినం. ఇచ్చిండ్రా..? ఇక్కడి బీజేపీ అభ్యర్థి డీకే ఆరుణగారు. ఆమె ఐదేళ్ల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. పాలమూరుకు జాతీయ హోదా తెచ్చిందా..? మరి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ దిగజారిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 రూపాయలకు పడిపోయింది. ఇది భారతదేశ గౌరవమా..? ఇది నరేంద్రమోదీ పరిపాలన ఫలితమా..? కేంద్రంలో 18 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నయ్. ఆ ఖాళీలు నింపుతున్నరా..? మరె నిరుద్యోగం ఎట్ల పోవాలె’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెస్తే వాటికి వ్యతిరేకంగా ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేసిండ్రు. ఈ ధర్మా సందర్భంగా దాదాపు 750 మంది రైతులు చనిపోయిండ్రు. పోలీసు కంచెలు పెట్టి వాళ్లను కొట్టిండ్రు తప్ప ఢిల్లీ లోపలికి రానియ్యలే. నేను మన రాష్ట్రం తరఫున పంజాబ్‌కు పొయ్యి చండీగఢ్‌లో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు సాయం జేసిన. చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కో నవోదయ పాఠశాల ఇయ్యాలె. మనం 33 జిల్లాలు చేసుకున్నం. ఒక్క నవోదయ పాఠశాల అయినా ఇచ్చిండ్రా. ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వెయ్యొద్దు. నేను నూరు ఉత్తరాలు రాసినా ఒక్కటి గూడా ఇయ్యలే. అసుంటి బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలె..? దయచేసి ఆలోచన చేయండి’ అని కేసీఆర్ చెప్పారు.
‘దేశంలో మోదీ 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు. మాకొక్కటి ఇయ్యమని బతిలాడినం. ఒక్కటన్నా ఇచ్చిండా..? మరెందుకు ఓటెయ్యాలె అని నేను అడుగుతున్నా. అంతేకాదు, నేను యువతకు ఒక్కటే చెబుతున్నా. భవిష్యత్తు మీది. తెలంగాణ మీది. ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తరో, ఎవరు న్యాయంగా ఉంటరో వాళ్లకు ఓటేస్తెనే మన బతుకులు బాగుపడుతయ్. పనిచేయని వాళ్లకు ఓటు వేస్తే ఇబ్బంది పెడుతరు. అందుకే ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి ఓటు వేయండి’ అని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

