బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 20:36:47

చెరువులో మునిగి బాలిక మృతి..

చెరువులో మునిగి బాలిక మృతి..

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో హోలీ వేడుకల్లో భాగంగా రంగులు చల్లుకొని స్నానానికి వెళ్లిన ఓ బాలిక చెరువులో మునిగి మృతి చెందింది. సంఘటన వివరాల్లోకి వెళితే గోపాలపురానికి చెందిన పేరం సీతరాములు, నాగమణి దంపతులకు ఇందు(14), సింధు ఇద్దరు కవలలు. హోలీ వేడుకల్లో ఇందు స్నేహితులతో కలిసి పాల్గొంది. అనంతరం స్నేహితులందరు కలిసి గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇందు లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయింది. మిగతా వారు భయంతో గ్రామంలోకి వెళ్లి  జరిగిన సంగతి కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్తులు వచ్చి ఇందు మృతదేహాన్ని బయటికి తీశారు. బాలిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి చుదువుతుంది.logo