MLA Vivek | వివేక్ నీ బట్టలూడదీసి కొడతా.. చెన్నూర్ ఎమ్మెల్యేకు బీజేపీ ఆభ్యర్థి గొమాసె హెచ్చరిక
‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం ముప్పై ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నది. వారిది స్థానికేతరుల కుటుంబం. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని అవాకులు, చెవాకులు పేలుతున్నది.
MLA Vivek | పెద్దపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం ముప్పై ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నది. వారిది స్థానికేతరుల కుటుంబం. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని అవాకులు, చెవాకులు పేలుతున్నది. ఇలాంటి విధానాలను మానుకోలేకపోతే వివేక్ వెంకటస్వామి బట్టలూడదీసి కొడతా’ అంటూ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గొమాసె శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు.
గురువారం ఆయన పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి మాట్లాడుతూ తనపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. అనంతరం హరీశ్‌బాబు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటూ.. ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టేస్తున్నారని, అలా కాకుండా తన కూతురుపై ఒట్టుపెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో జూలైలో జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే అభద్రతా భావంతో ఆగస్టు 15 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి, నాయకుడు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

