Audi Cars | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జూన్ నుంచి అమలులోకి రానున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు రవాణా కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని, దీంతో వాహన ధరలు పెంచకతప్పడం లేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 7 వేల యూనిట్ల వాహనాలను విక్రయించింది.