Bombay Circus | కంటోన్మెంట్, ఏప్రిల్ 25 : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో శుక్రవారం నుంచి ప్రఖ్యాత గ్రేట్ బాంబే సర్కస్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ఇలియాస్ ఖాన్ తెలిపారు. గురువారం జింఖానా మైదానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు. బాంబే సర్కస్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఇథియోపియన్ డయాబోలో, స్వింగింగ్ జిమ్ విన్యాసాలు,
కంటార్షన్, రోలర్ స్కేటింగ్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. రోజుకు మూడు షోలు ఉంటాయని, 45 రోజుల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయన్నారు. అన్ని వయస్సుల ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, వేసవి సెలవుల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో సిబ్బంది ఉన్నికృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.