Lok Sabha Elections | లక్నో: యూపీలోని ఇటావా లోక్సభ స్థానంలో భార్యాభర్తల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్ శంకర్ కతేరియా మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా బుధవారం ఇదే స్థానానికి రామ్ శంకర్ కతేరియా భార్య మ్రిదుల కతేరియా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
2019 ఎన్నికల సమయంలోనూ ఆమె ఇలానే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. కాబట్టి, ఆమె ప్రతిసారి నామినేషన్ వేసి విత్డ్రా చేసుకుంటారని కతేరియా అన్నారు. అయితే, తాను నామినేషన్ వేసింది విత్డ్రా చేసుకోవడానికి కాదని, ఈసారి తాను పోటీ చేస్తానని మ్రిదుల ప్రకటించారు.