MLC By Election | టెట్‌పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం!
టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా? పరీక్షను వాయిదా వేయాల్సిందేనా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
- మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్ష
- మధ్యలో మే 27న పోలింగ్
MLC By Election | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా? పరీక్షను వాయిదా వేయాల్సిందేనా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. అయితే మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
పోలింగ్ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులేకానుండటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటివరకు ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారో వెల్లడించలేదు. ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

