రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్


Sat,February 17, 2018 05:36 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.99, రూ.319 పేరిట ఈ రెండు ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.99 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 26 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. నేషనల్ రోమింగ్ కూడా లభిస్తుంది. ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ లభిస్తుంది. అలాగే రూ.319 ప్లాన్‌లో కూడా ఈ బెనిఫిట్సే లభిస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులుగా ఉంది. కాగా ఈ రెండు ప్లాన్లలోనూ కస్టమర్లకు కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే అన్‌లిమిటెడ్‌గా లభిస్తాయి. వీటిలో ఎలాంటి డేటా రావడం లేదు.

4116

More News

VIRAL NEWS