గురువారం 04 జూన్ 2020
Suryapet - Jan 23, 2020 , 03:54:32

జిల్లా కేంద్రానికి చేరిన బ్యాలెట్ బాక్సులు

జిల్లా కేంద్రానికి చేరిన బ్యాలెట్ బాక్సులు


సూర్యాపేటఅర్బన్ : జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ అమయ్ ఆదేశాలు సిబ్బంది పాటించడంతో సాయంత్రం 7గంటల వరకు ఇతర ప్రాంతాల నుంచి సైతం బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. గతంలో బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు చేరే సమయానికి రాత్రి 11 నుంచి 12గంటలు పట్టేది. కానీ ప్రస్తుతం అధికారుల సూచనల మేరకు ఏర్పాటు చేయడంతో మొత్తం బ్యాలెట్ బాక్సులు రాత్రి 9లోపు కౌంటింగ్ కేంద్రమైన శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాలకు రూట్ సిద్ధం చేసి వాహనాలు ఏర్పాటు చేయడంతో పనులు చకచకా జరిగాయి. ఆలస్యం లేకుండా బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.

బ్యాలెట్ బాక్సులకు సీల్..    

మున్సిపల్ ఎన్నికల అనంతరం సాయంత్రం పోలింగ్ కేంద్రాలలో పార్టీ ఏజంట్ సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.పోలింగ్ సిబ్బంది సమన్యయంతో ఆలస్యం లేకుండా సామాగ్రితో పాటు బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రాలకు తరలించారు.logo