Wax Sand | నయా ట్రెండ్.. మార్కెట్లో హల్చల్ చేస్తున్న వాక్స్ సాండ్
ఒత్తయిన చీకట్లో చిట్టి కొవ్వొత్తుల వెలుగు కాంతిని వెదజల్లడంతోపాటు ఇంటికి అందాన్ని అందిస్తుంది. సందర్భం ఏదైనా కొవ్వొత్తులతో కూడిన అలంకరణలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.
Wax Sand | ఒత్తయిన చీకట్లో చిట్టి కొవ్వొత్తుల వెలుగు కాంతిని వెదజల్లడంతోపాటు ఇంటికి అందాన్ని అందిస్తుంది. సందర్భం ఏదైనా కొవ్వొత్తులతో కూడిన అలంకరణలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. చీకటిని పారదోలడానికే కాదు ఈమధ్య కొవ్వొత్తులు అలంకరణలోనూ భాగమయ్యాయి. ఇందుకోసం రకరకాల ఫ్లేవర్లు, రంగులు, కస్టమైజ్డ్ కొవ్వొత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ కొవ్వొత్తుల ట్రెండ్‌ని బీట్ చేస్తూ మార్కెట్లో హల్చల్ చేస్తున్నది వాక్స్ సాండ్. కొవ్వొత్తులను తయారుచేసే మైనంతో చేసిన ఈ సాండ్ చూసేందుకు అచ్చంగా ఇసుకను పోలి ఉంటుంది.
దీన్ని అందమైన గ్లాసులు, గిన్నెలు, చిట్టిపొట్టి కుండలు.. ఇలా దేంట్లో అయినా పోసి వెలిగించేయడమే. ఈ మైనపు ఇసుకలో ఠీవిగా నిల్చోడానికి ప్రత్యేకంగా తయారు చేసిన వత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సాండ్ కూడా రకరకాల రంగులు, ఫ్లేవర్లలో లభిస్తున్నది. జాస్మిన్, లావెండర్ వంటి గుబాళించే ఫ్లేవర్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ సాండ్ నీటిలో తడవదు, అందువల్ల అందమైన నీటి తొట్టెల్లోనూ దీనిని పోసి దీపాలు పెట్టేయొచ్చు. ఈ మైనపు ఇసుక ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ ఇంటిని అలంకరించుకోడానికి దీన్ని ట్రై చేసేయండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

