Traffic Jam | జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ బోయినపల్లి, తిరుమలగిరి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అల్వాల్, ప్యారడైజ్, మారేడ్‌పల్లి, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీర్‌బాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంలోనూ ఈదురుగాలులతో వానపడింది.
అలాగే, జవహర్‌నగర్, జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డం, బంజారాహిల్స్, మలక్‌పేట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఎల్బీనగర్, కాప్రా, రాంనగర్‌తో పాటు చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్ అయ్యింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయదుర్గం బయోడైవర్సిటి కూడాలి నుంచి ఐకియా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.