హనుమకొండ, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మూడేండ్లు దగ్గరపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇ చ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ము ఖ్యంగా లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతూ కోటికి పైగా ఎకరాల భూ ములను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చింది. తరాల నాటి ఆస్తులు, దశాబ్దాల కిందట కొనుగోలు చేసిన భూములను య జమానులకు కాకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా రూపొందించిన ఈ జాబితాపై రాష్ట్రం అ ట్టుడుకుతున్నది. లక్షల మంది బాధితులు పోరాటాలు చేస్తున్నారు. ప్రభు త్వ విధానం ఏమిటో అ సెంబ్లీ సమావేశాల్లో స్పష్ట త ఇస్తుందని ఆశించారు. రాత్రికి రాత్రే నిషేధం వి ధించడంపై తప్పు ఒప్పుకొని సరిచేస్తుందని, బా ధ్యులపై చర్యలు తీసుకుంటుందని అనుకున్నారు. కానీ ప్రభు త్వం మాత్రం ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నది.
22ఏ విషయంలో దోషిగా తేలడంతో, తప్పించుకొనేందుకు దారులు వెతుకుతు న్నది. అందుకే సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు ప్రజల దృష్టిని మళ్లించే ‘డైవర్షన్’ విధానాన్నే నమ్ముకున్న ది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటు న్న అతిపెద్ద సమస్యకు పరిష్కారం చూపకుండా, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమం త్రి అక్కసు వెళ్లగక్కారు. తమ భూముల సంగతేమిటని ప్రశ్నిస్తున్న వారికి జవాబు చెప్పకుండా, కేసీఆర్ కుటుంబం భూములను కొల్లగొట్టిందని అ డ్డగోలుగా ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ భూముల లెక్కలను ప్ర స్తావించారు. అయితే అవన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన గణాంకాలే కావడం గమనార్హం. ప్రభుత్వాధినేతగా సమస్యకు ప రిష్కారం చూపకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలా పక్కదారి పట్టిస్తున్నారని, అందుకే రేవంత్‌ను ‘డైవర్షన్ కింగ్’ అంటారని ఎద్దేవా చేస్తున్నారు.
వెయ్యిరోజుల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొన్నదో, బీఆర్ఎస్ నిరసనలకు వచ్చిన స్పందనతో స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను ఎదుర్కొనడం కష్టమని ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. సభలో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతో రేవంత్‌రెడ్డి ముందునుంచే డై వర్షన్ విధానాన్ని అమలుచేశారని చెప్తున్నా రు. మొదటిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు బయట అడ్డుకోవడం ద్వారా డైవర్షన్ డ్రామా మొదలు పెట్టారు. మహిళా ఎమ్మెల్యేలపై వేధింపులతో మరోస్థాయికి తీసుకెళ్లారని అంటున్నారు. ఇలాంటి చర్యలతో రేవంత్ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారని చెప్తున్నారు.
ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్‌ను అతలాకుతలం చేస్తున్నప్పుడు, పరిష్కారం చూపాల్సిందిపోయి డైవర్షన్ చేయడం మొ దటినుంచీ జరుగుతున్నది. గతంలో రుణమాఫీ అమలు కాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు పోరాటం చే శారు. ప్రభుత్వపరం గా స్పష్టత ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష నాయకులపై ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట ప్రజల దృష్టిని మళ్లించారు. రైతుబంధు అమలు తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజనులోనూ ఇచ్చిందని గుర్తుచేస్తూ, కాం గ్రెస్ ప్రభుత్వం సీజన్లకు సీజన్లు ఎగ్గొడుతున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సమయంలో సీఎం తనదైన శైలిలో కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లపై విచారణ పేరి ట దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలోని సమస్యల నుంచి తా త్కాలికంగా బయటపడేందుకు కూడా రే వంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. అధిష్ఠానం సైతం తీవ్ర అ సంతృప్తితో ఉన్నదట. ఇలా ప్రభుత్వంలో, పార్టీపరంగా తనపై వస్తున్న వ్యతిరేకతను తాత్కాలికంగా పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ కొండా సురేఖ ఉదం తం. కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేస్తూ, బర్తరఫ్ చేశారని, త ద్వారా ప్రజల దృష్టిని విజయవంతంగా మళ్లించగలిగారని అంటున్నారు.