Flax Seeds | అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మందగిస్తుంది. మొహంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి చాలామంది బ్యూటీ పార్లర్కు వెళ్తుంటారు.
Flax Seeds | అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మందగిస్తుంది. మొహంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి చాలామంది బ్యూటీ పార్లర్కు వెళ్తుంటారు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి అవిసె గింజలు. వీటితో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడా సొంతమవుతుంది. అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి, జుట్టుకు మెరుపును ఇస్తాయి. ఈ గింజలతో తయారు చేసిన ప్యాక్ వేసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఫేస్ ప్యాక్..
ఒక టీస్పూన్ అవిసె గింజలను కప్పు నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న మంటమీద నీరంతా జెల్గా మారేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత జెల్ను ముఖానికి పట్టించాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న వాపు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
రోజ్ వాటర్తో..
అవిసెలను నీళ్లలో నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల అవిసె గింజల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
జుట్టు ఆరోగ్యానికీ..
ఒక టీస్పూన్ అవిసె గింజల పొడిని చిన్న గిన్నెలో వేసి, ఒక గుడ్డును కొట్టి ఆ పొడిలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

