Rain Alert | హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. రాబోయే గంటలో భారీ వర్షం..!
Rain Alert | రాబోయే గంట సమయంలో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్ హైదరాబాద్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది.
Rain Alert | రాబోయే గంట సమయంలో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్ హైదరాబాద్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. కూకట్పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లితో పాటు పలుచోట్ల వర్షం కురుస్తుందని చెప్పింది. ఇప్పటికే కొండాపూర్‌లో వర్షం కురుస్తుండగా.. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. అలాగే సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది.
ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల వాన కురుస్తున్నది. అదే సమయంలో హైదరాబాద్‌వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం, రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

