హైదరాబాద్ : హాస్టల్లో(Hostel) నీళ్లు(Water) వాడుకున్నందుకు యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణ రహితంగా దాడి(Attack on youth )చేశాడు. ఈ విషాదకర సంఘటన ఎస్ఆర్ నగర్లో(SR Nagar )చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎస్ఆర్నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఓ యువకుడు హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు ఆగ్రహంతో హాస్టల్ నిర్వాహకుడు సదరు యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. పలువురు వారించినా వినిపించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. బాధితుడు హాస్టల్ నిర్వాహకుడిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడి దాడి
హైదరాబాద్ – ఎస్ఆర్నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు.… pic.twitter.com/vn4NAzRpcX
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024