కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే..’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రోమోతో పాటు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రధన్ ఈ పాటకు స్వరాల్ని అందించగా, రామజోగయ్యశాస్త్రి గీత రచన చేశారు. ‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే.. నా లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యిందే’ అంటూ ఈ పాట ప్రోమో సాగింది.
నాయకానాయికలు కార్తికేయ, ఐశ్వర్యమీనన్ నృత్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. ఐశ్వర్యమీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: రథన్, దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి.