Tips | జిడ్డు ఇలా వదిలిద్దాం.. చిన్న చిట్కాలతో వంటపాత్రలు తళతళలా
శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే..
Tips | శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే.. పాత్రలను మురికి లేకుండా శుభ్రంగా కడగడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ స్టీల్ పాత్రలలోనే వంటలు చేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడం సులభమే. కానీ, రోటీ, దోశ, చపాతి చేసే ఐరన్ పాత్రల జిడ్డు వదిలించడం అనేది కష్టమైన పని. ఇక, ఐరన్ పాత్రలో కూరలు వండటం వల్ల అవి త్వరగా నల్లగా మారుతాయి. నూనె పొరలు పేరుకుపోతాయి. నల్లగా మారిన ఐరన్ పాత్రలో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడం కూడా కష్టం. అయితే, చిన్న చిట్కాలతో వంటపాత్రలను తళతళలాడేలా చేసుకోవచ్చు.
బేకింగ్ సోడా, ఉప్పుతో..
ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరిగించాలి. ఆ వేడి నీటిని నల్లగా మారిన ఐరన్ పాత్రలో పోసి అరగంట సేపు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో కడిగేస్తేసరిపోతుంది.
నిమ్మకాయతో..
చాలా వస్తువులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్, నూనె వేసి పది నిమిషాలు మరిగించాలి. ఆ నీరు పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్..
పాత్రలకు పట్టిన మరకలనుతొలగించడంలో వెనిగర్ మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బాగా మరకలు పడిన గిన్నెలో నీరు, వైట్ వెనిగర్ సమాన పరిమాణంలో వేసి నానబెట్టాలి. నానబెట్టిన అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వెనిగర్‌లో ఉండే యాసిడ్ లక్షణాలు మరకలను వదిలించడానికి సహాయపడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

