Sunita Williams | మూడోసారి రోదసిలోకి సునీతా విలియమ్స్.. బోయింగ్ ‘స్టార్లైనర్’ ద్వారా నేడు నింగిలోకి
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్లైనర్' వ్యోమనౌకలో ఆమె మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలసి అంతరిక్షయానం చేయనున్నారు.
Sunita Williams | వాషింగ్టన్, మే 6: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో ఆమె మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనున్నది.
ఇందులో మిషన్ పైలట్గా వ్యవహరించనున్న సునీతా విలియమ్స్ (58).. అంర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ వారం రోజులపాటు గడపనున్నారు. ఈ రోదసి యాత్రకు తాము సిద్ధంగా ఉన్నామని, మూడోసారి అంతరిక్షయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ యాత్ర విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని తీసుకెళ్లి, తీసుకొచ్చిన రెండవ ప్రైవేట్ సంస్థగా బోయింగ్ ఆవిర్భవిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

