లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ ట్రస్టు, యూనివర్సిటీలో ఇవాళ ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు(ED raids) నిర్వహిస్తున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీ నేత ఆజమ్ ఖాన్ జైలు విక్ష అనుభవిస్తున్నారు. రాంపూర్, షహరాన్‌పుర్, జామియా నగర్ ప్రాంతాల్లోని సుమారు 10 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నారు. సీఆర్పీఎఫ్ భద్రత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. షహరాన్‌పూర్‌లోని సీఏ ఇల్లు, రెండు కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఇండ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. వీరంతా ట్రస్టుతో లింకు ఉన్నారు. ప్రైవేటు కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టు నిధులను మళ్లించి, ఆ నిధులను ట్రస్టు, వర్సిటీకోసం వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్నోలో ఉన్న ట్రస్టు శాఖకు.. ఆజమ్ ఖాన్‌తో పాటు ఓ మాజీ మంత్రి, కుటుంబసభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో 2006లో మొహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. రాంపూర్‌లో ట్రస్టు ఆధ్వర్యంలో యూనివర్సిటీ నడుస్తున్నది. ఆ వర్సిటీలో ఉన్న 40 భవనాల్లో 38 బిల్డింగ్‌లను కూల్చివేయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.
#WATCH | Uttar Pradesh | The Enforcement Directorate conducts a raid at Mohammad Ali Jauhar University in Rampur
Visuals from outside the University https://t.co/C2nRPUJZVO pic.twitter.com/E5boZcgZgp
— ANI (@ANI) August 19, 2026