మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 01, 2020 , 02:29:43

అదనపు పీపీ శశికరణ్‌రెడ్డి ఉద్యోగ విరమణ

అదనపు పీపీ శశికరణ్‌రెడ్డి ఉద్యోగ విరమణ

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శశికరణ్‌రెడ్డి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీసుధ హాజరై మాట్లాడారు. 25 ఏళ్లు ప్రాసిక్యూషన్‌గా న్యాయ వ్యవస్థకు సహకరించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శశికరణ్‌రెడ్డి భవిష్యత్తులో కూడా న్యాయ వ్యవస్థకు ఉపయోగకారిగా ఉండాలని అన్నారు. ప్రాసిక్యూషన్‌ న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టే బాధితుల, సాక్షుల సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టులు ముద్దాయిలకు శిక్షలు విధిస్తాయని అన్నారు. అనంతరం శశికరణ్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల రమేశ్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజేందర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మధుసూదన్‌రావు, న్యాయవాదులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, జీవీ కృపాకర్‌రెడ్డి, రాజలింగం, రవికాంత్‌శర్మ, బార్‌ కార్యదర్శి మాలిక్‌ రాజ్‌, అదనపు పబ్లిక్‌ ప్లాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.


logo