న్యూఢిల్లీ: భారతదేశపు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS Officer) రవి సిన్హా (Ravi Sinha ) నియమితులయ్యారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న సమంత్ గోయెల్ పదవీకాలం ఈ నెల 30న ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రవి సిన్హాను నియమించారు.
రవి సిన్హా రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు. ప్రస్తుతం అప్పాయింట్స్ కమిటీ ఆయనను RAW సెక్రెటరీగా నియమించినట్లు ప్రకటించింది.
Ravi Sinha, IPS (CG:88) to be the new Secretary, Research & Analysis Wing. pic.twitter.com/vEr3hfokZJ
— ANI (@ANI) June 19, 2023