Bajaj Pulsar NS400Z | దేశీయ ఆటో దిగ్గజం ‘బజాజ్ ఆటో’.. భారత్ మార్కెట్లోకి న్యూ 2024 పల్సర్ ఎన్ఎస్ 400జడ్ (Pulsar NS400Z) మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ఇంట్రడ్యూసరీ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. నెల రోజుల తర్వాత దీని ధరను బజాజ్ ఆటో సవరించనున్నది. అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ మోటారు సైకిల్.. ఎన్ఎస్200 బైక్ మాదిరిగా కనిపిస్తున్నా, పలు కొత్త ఫీచర్లు ఉంటాయి. సెంటర్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, టూ న్యూ లైటింగ్ బోల్ట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు బోల్డర్ హెడ్ ల్యాంప్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ మోటారు సైకిల్ లో న్యూ కేటీఎం 250 డ్యూక్ మోటారు సైకిల్లో వినియోగించిన రేర్ వ్యూ మిర్రర్స్ వాడారు. చూడటానికి స్పోర్టీ లుక్ కలిగి ఉంటుందీ బైక్. ‘ఎన్ఎస్’ డెకల్స్తోపాటు ప్రముఖంగా ఫ్యుయల్ ట్యాంకు, పొడవైన రేడియటర్ శ్రౌడ్స్, సైడ్ ప్యానెల్స్, స్ప్లిట్ సీట్స్, రీస్టైల్డ్ టెయిల్ సెక్షన్, స్ప్లిట్ టెయిల్ లైట్స్, స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతోపాటు టైల్ టీడీ ఉంటుంది. ఆసక్తిగల వారు రూ.5000 చెల్లించి ఈ మోటారు సైకిల్ బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల మొదటి వారంలో బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
రేర్‌లో మోనోషాక్, గోల్డ్ ఫినిష్డ్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఎన్ఎస్200 వంటి పల్సర్ మోడల్ మోటారు సైకిళ్లకు భిన్నంగా ఎల్సీడీ డిస్ ప్లే విత్ డిఫరెంట్ లే ఔట్ తో వస్తుంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ తోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటది.
బజాజ్ డామినార్ 400, కేటీఎం 390 డ్యూక్ మోటారు సైకిళ్లలో వినియోగించి 373సీసీ ఇంజిన్ ను బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జడ్ మోటారు సైకిల్లో వినియోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 39 బీహెచ్పీ, 35ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుందీ బైక్. గంటకు 154 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హీరో మార్విక్ 440, కేటీఎం 250 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, బజాజ్ డామినార్ 400 వంటి మోటారు సైకిళ్లకు న్యూ బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జడ్ గట్టి పోటీ ఇవ్వనున్నది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. స్పోర్ట్స్ రోడ్, రైన్, ఆఫ్, రోడ్ వంటి రైడింగ్ మోడ్స్‌లో వస్తుందీ బైక్.