Cooking | ఆనపకాయ తురుము: ఒక కప్పు, మైదా: నాలుగు టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్: ఒక టేబుల్ స్పూను, గోధుమపిండి: మూడు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు: అర టీస్పూను, కారం: ఒక టీస్పూను, జీలకర్ర: అర టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తురుము: పావు కప్పు, కరివేపాకు: అయిదు రెబ్బలు, టమాటా సాస్: రెండు స్పూన్లు, చిల్లీసాస్: ఒక టీస్పూను, నూనె: సరిపడినంత, ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా ఆనపకాయ తురుములో మైదాపిండి, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఉండల్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయి స్టవ్ మీద పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. బాగా వేగాక చిల్లీసాస్, టమాటా సాస్, కొత్తిమీర తురుము వేసి కలిపి ఆనపకాయ ఉండలను వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. అంతే ఆనపకాయ మంచూరియా రెడీ.