Lakshmi Parvathi | నందమూరి బాలకృష్ణపై ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎన్టీఆర్కు అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యసాయి జిల్లాలో శుక్రవారం నాడు లక్ష్మీపార్వతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలని పిలుపునిచ్చారు. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు అని.. హిందూపురం అభివృద్ధి కోసం వైసీపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో బాలకృష్ణ హత్య కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను కలిసి కేసులు లేకుండా చేశానని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. అందుకు బాలకృష్ణనే సాక్ష్యమని తెలిపారు. ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాపాడారని తెలిపారు. హిందూపురం అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలని పిలుపునిచ్చారు.